- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైఎస్ షర్మిల అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
దిశ, నిజామాబాద్ సిటీ : షర్మిలమ్మకు ప్రజాదరణ పెరగడాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ప్రజాప్రస్థానం పాదయాత్ర అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పార్టీ నేతలతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ ప్రశాంతంగా జరుగుతున్న ప్రజాప్రస్తానం పాదయాత్రను అధికార పార్టీనేతలు అడ్డుకోవాలని చూసి, యుద్ధ వాతావరణంగా మార్చారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలు షర్మిలమ్మను చూసి భయపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కె.మౌనిక, నగర పార్టీ అధ్యక్షులు కస్తూరి ప్రవీణ్, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, నగర యువజన విభాగం అధ్యక్షులు సంతోష్, నగర బీసీ విభాగం అధ్యక్షులు రవి కుమార్, పార్టీ సీనియర్ నాయకులు పాండు, దినేష్ , స్వప్న, వినోద్ తదితరులు పాల్గొన్నారు.