- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిచ్చి కూతలు కూస్తే... తరిమికొడతాం : బీఆర్ఎస్ మండల నాయకులు..
దిశ, నవీపేట్ : సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ పై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎక్కడికక్కడ అడ్డుకొని తరిమికొడతామని మండల బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. నాలేశ్వర్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను మండల బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సమావేశంలో ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ మత రాజకీయాలు చేస్తూ గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, నియోజకవర్గ అభివృద్ధిని మరిచి పిచ్చికూతలు కూస్తున్నాడని విమర్శించారు. గతంలో తన పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో కొడతానని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించినా బుద్ధి మారలేదని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను, ఎమ్మెల్యే షకీల్ ను విమర్శిస్తే తరిమికొడతామని హెచ్చరించారు.
అనంతరం బినోల విండో చైర్మన్ మగ్గరి హన్మాండ్లు మాట్లాడుతూ నాలేశ్వర్ గ్రామంలో అందరి సహకారంతోనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారని, శివాజీ పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గ్రామానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా నీచపు రాజకీయాలు చేసే అరవింద్... ఎమ్మెల్సీ కవిత ను, ఎమ్మెల్యే షకీల్ ను విమర్శిస్తే తరిమికొడతామని అన్నారు.
అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుచ్చన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ నాలేశ్వర్ శివాలయం దారికి 3 కోట్ల 40 లక్షలు మంజూరు చేశారని, తన సొంత వ్యాపారం చేసుకుంటూ నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న షకీల్ పై ఆరోపణలు చేసిన అరవింద్, డి.శ్రీనివాస్ ముడుపుల వ్యవహారం గురించి జిల్లా ప్రజలకు తెలుసునని అన్నారు. అభివృద్ధికి పాటుపడుతున్న కవిత పై గల్లీ లీడర్ మాదిరి విమర్శలు చేస్తూన్న అరవింద్ మండలానికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో నాలేశ్వర్ ఉపసర్పంచ్ లక్ష్మణ్, నాయకులు నర్సింగ్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.