BREAKING: నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం.. స్కానింగ్ సెంటర్‌లో మహిళలపై ఆపరేటర్ వికృత చేష్టలు (ఫొటోలు వైరల్)

by Shiva |
BREAKING: నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం.. స్కానింగ్ సెంటర్‌లో మహిళలపై ఆపరేటర్ వికృత చేష్టలు (ఫొటోలు వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవరికైనా జ్వరం వస్తే వైద్యుడు మందలిస్తే.. నయం అయిపోతోంది.కానీ, సమస్య పెద్దది అయితే తప్పకుండా రోగ నిర్ధారణ పరీక్షలు (డయాగ్నాస్టిక్ టెస్టులు) చేయాల్సిందే. స్కానింగ్ చేసే సమయంలో ఒక్కోసారి ఒంటిపై ఉన్న దుస్తులు తీసివేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆసరగా చేసుకుని కొందరు అక్రమార్కులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వైద్యం కోసం అని వస్తే బట్టలూడదీసి మరీ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.

స్కానింగ్‌కు వచ్చే మహిళలు, యువతుల న్యూడ్ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అయితే, తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అసులు స్కానింగ్ సెంటర్‌కు అనుమతి ఎవరిచ్చారు, ఎంతకాలం నుంచి ఈ ఘోరం జరుగుతోందంటూ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఘటనపై సీరియస్ అయ్యారు. వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడికి అల్టీమేటం జారీ చేశారు. ఒకవేళ సరైన సమాధానం ఇవ్వకపోతే సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Advertisement

Next Story

Most Viewed