MLA Dhanpal Suryanarayana Gupta : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు..

by Sumithra |
MLA Dhanpal Suryanarayana Gupta : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించే బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. నగరంలోని వినాయక్ నగర్ లక్ష్మి సిల్క్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఊరేగింపులో ఎమ్మెల్యే ధనపాల్ అమ్మవారి బోనాన్ని ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగలలో బోనాల పండుగ ఒకటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాడమాసంలో ప్రజలు భక్తి శ్రద్దలతో బోనం చేసి అమ్మవారిని కొలవడం ఆనవాయితీగా వస్తోందని, భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజించి నైవేద్యం సమర్పిస్తారన్నారు.

సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని, పిల్లా జల్లా, గొడ్డు, గోదా అన్నింటిని కాపాడాలని అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. అమ్మవారే స్వయంగా తమ ఇంటికి వచ్చినట్లు భక్తులంతా భావిస్తారని, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని భక్తుల ప్రగాఢ నమ్మకమని ధన్ పాల్ అన్నారు. ఇందూర్ ప్రజల పై అమ్మవారి దయ ఉండాలని తన కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో 22 వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి లావణ్య, లింగం, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, ప్రభాకర్, ఆనంద్, పవన్, కార్తీక్, ముందడ పవన్, సతీష్, హరీష్, కృష్ణ,బాబీ సింగ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story