వర్షాకాలం తస్మాత్ జాగ్రత్త....

by Kalyani |
వర్షాకాలం తస్మాత్ జాగ్రత్త....
X

దిశ, గాంధారి : వర్షాకాలం వచ్చిందంటే చాలు మనస్సుకు ప్రశాంతత నిచ్చే చల్లటి వాతావరణం, కన్నులకు పచ్చటి ప్రకృతి కనువిందు చేస్తాయి. వర్షాకాలం అంటే రైతన్నలు మురిసిపోతుంటారు. చేను చేలక దుక్కిదున్ని నాట్లు స్టార్ట్ చేస్తారు. అయితే ఈ కాలంలో రైతులకు సంతోషం తో పాటు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలి,అందుకు కావాల్సిన తగు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో జరిగే ప్రమాదాలను ఎలా నివారించవచ్చు అనేది చూద్దాం.

పాములతో తస్మాత్ జాగ్రత్త....


వర్షాకాలం వచ్చిందంటే చాలు రైతులకు, సామాన్య ప్రజలకు పాములతో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఇన్ని రోజులు భూమి లోపల ఉండే ప్రాణులు ఒక్కసారిగా వర్షం పడడంతో ఉక్కపోతతో ఒక్కసారిగా పాములు బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా పాములు భూమి పై సంచరిస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని విషపూరితమైనవి ఉండగా కొన్ని సాధారణ పాములుగా ఉంటాయి. అయితే విషపూరితమైన పాములు ఒకవేళ అనుకోని ఎడల వాటి ప్రమాదానికి గురైనచో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి దిశ వివరణ కోరగా డాక్టర్, శాఖ అధికారి లైన్మెన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాముకాటుకు గురైన వ్యక్తి టెన్షన్ పడకూడదు.... డాక్టర్ సాయికుమార్


ఉత్నూర్ ప్రైమరీ హెల్త్ ఆసుపత్రి డాక్టర్ సాయి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎవరైతే పాము కాటు గురి అవుతారో వారు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఒకవేళ టెన్షన్ పడినట్లయితే రక్తప్రసరణ ఇంకా అధికంగా జరిగి పాము కొరలో నుంచి వచ్చిన విషం శరీరం అంతా పాకే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సమయంలో మాత్రం పాముకాటు గురైన వ్యక్తి ప్రశాంతంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా పాము కాటుకు గురైన వ్యక్తికి వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చే లా చర్యలు తీసుకోవాలని కొందరు వ్యక్తులు రక్తప్రసరణ జరగకుండా తాడు, బట్టలు వంటివి గట్టిగా కడతారని అలా చేయడం వల్ల రక్తప్రసరణ మొత్తం సరఫరా ఆగిపోయి ఆ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకు వచ్చే విధంగా చేస్తే వైద్య సిబ్బంది ఏఎస్ఎమ్ టీం వచ్చి ఏ పాము కరిచిన పాము విరుగుడు ఔషధం ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు.

బోర్లు మోటార్ల వద్ద జాగ్రత్త తీసుకోవాలి-ఏ ఈ సతీష్ రెడ్డి


వర్షాకాలంలో ముఖ్యంగా వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని అంతేకాకుండా రైతులు పంట పొలాల వద్ద బోరు మోటర్ల దగ్గర నుండి వెళ్లే వైర్లు క్రిందిగా ఉండి ప్రమాదానికి గురిచేస్తాయని, ముఖ్యంగా స్టార్టర్ బాక్స్ అవసరం అయితే పొడి కట్టెతో పట్టుకొని ఆన్ ఆఫ్ చేయాల్సి ఉంటుందని తడిగా ఉన్న చేతులతో తడిగా ఉన్న స్టార్టర్ బాక్స్ ను తాగొద్దని అన్నారు. ముఖ్యంగా కాలనీలో గల బోరు మోటార్లను ఆన్ ఆఫ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక కర్రతో లేదా ప్లాస్టిక్ వంటి వాటితో ఆన్ ఆఫ్ చేయాలని లేనియెడల రెండు తడిగా ఉన్నట్లయితే ప్రమాదానికి గురవుతారని అన్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడే క్రమంలో అతన్ని ముట్టుకోవద్దని ఏదైనా కర్రతో ప్లాస్టిక్ వస్తువుతో కరెంట్ షాక్ కలిగిన ప్రదేశం నుండి దూరం చేసే విధంగా అతని నెట్టేయాలి అని సూచించారు. ఎట్టి పరిస్థితిలో ఆ వ్యక్తిని ముట్టుకోవద్దని సూచించడం జరిగింది.

Next Story