ఆటో డ్రైవర్ కు పది రోజుల జైలు శిక్ష

by Sridhar Babu |
ఆటో డ్రైవర్ కు పది రోజుల జైలు శిక్ష
X

దిశ, భిక్కనూరు : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆటో డ్రైవర్ కు పది రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రతాప్ రెడ్డి బుధవారం తీర్పు చెప్పారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పాపన్న గారి సంతోష్ తాగిన మత్తులో ఆటో నడుపుతూ కొంతమంది వ్యక్తులతో గొడవ పడడమే కాకుండా న్యూసెన్స్ చేసినందుకుగాను డ్రంక్ అండ్ డ్రైవ్ కింద

కేసు బుక్ చేసి, కోర్టులో న్యాయవాది ముందు హాజరు పరచగా పది రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మేరకు సంతోష్ ను నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాయికుమార్ మాట్లాడుతూ ప్రజా స్వేచ్ఛకు భంగం కలిగేలా తాగి వాహనాలు నడపడం, వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed