- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కే.ఆర్.నాగరాజుకు వీడ్కోలు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కె.ఆర్.నాగరాజుకు శుక్రవారం ఉదయం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఆర్ముడ్ రిజర్వు పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఉదయం 7 గంటలకు పరేడ్ నిర్వహించి చివరి మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో విదులు సక్రమంగా నిర్వహించానన్నారు. 15 నెలల కాలంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాష్ట్ర అధికారుల మనన్నలు పొందానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అందరితో తనకున్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏఆర్) గిరిరాజ్, పరిపాలన అధికారి మధుసుదన్ రావు, ఏసీపీలు కిరణ్ కుమార్, సంతోష్ కుమార్, ఎస్బీ సిఐ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు, ఆర్ఐలు, ఆర్ ఎస్సైలు, ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.
కొత్త కమిషనర్ గా నిర్మల్ జిల్లా ఎస్పీకి ఇంచార్జి బాధ్యతలు..
నిజామాబాద్ ఇంచార్జి పోలీసు కమిషనర్ గా నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ సీపీగా పనిచేసిన కె.ఆర్.నాగరాజు శుక్రవారం పదవి విరమణ చేయడంతో ఆయన నుంచి ప్రవీణ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని మాజీ సీపీ కె.ఆర్.నాగరాజు, ప్రస్తుత ఇంచార్జి సీపీ ప్రవీణ్ కుమార్ లు మర్యాద పూర్వకంగా కలిసారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా కొత్తగా ఎవరిని నియమించకపోవడంతో తాత్కాలికంగా నిర్మల్ జిల్లా ఎస్పీకి ఇంచార్జి బాధ్యతలు ఇచ్చినట్లు తెలిసింది.