జనవరి 2న ఏకసభ్య కమిషన్ రాక

by Naveena |
జనవరి 2న ఏకసభ్య కమిషన్ రాక
X

దిశ ,నాగిరెడ్డిపేట్ : ఎస్సీ వర్గీకరణ అభిప్రాయ సేకరణ కోసం ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అక్తర్ జనవరి 2వ తేదీన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నాగిరెడ్డిపేట మండల గౌరవ అధ్యక్షుడు కుంటోల్ల యాదయ్య పత్రిక ప్రకటనలో తెలిపారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణపై అనేక పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తుచేస్తూ..ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సమస్యలను ఏకసభ్య కమిషన్ కు తెలిపే విధంగా ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల సభ్యులు వర్గీకరణ విషయమై తమ తమ అభిప్రాయాలను దరఖాస్తులను నిజామాబాద్ కలెక్టరేట్ లో ఆయనకు సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తు ఫారాలు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు,ఉపాధ్యాయులు, వైద్యులు షెడ్యూల్ కుల సంఘాల నాయకులు ఇతర ఉద్యోగులు, ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వినతి పత్రాలు అందజేయాలని కోరారు.

Advertisement

Next Story