'టాంకాం' ను సందర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..

by Sumithra |
టాంకాం ను సందర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
X

దిశ, ఆర్మూర్ : ప్రభుత్వ ఆధ్వర్యంలో విదేశీ ఉద్యోగ కల్పన చేస్తున్న హైదరాబాద్ లోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టాంకాం) కార్యాలయాన్ని శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. ఇటీవల చేపట్టిన ఇజ్రాయిల్ ఉద్యోగాల భర్తీ గురించి 'టాంకాం' జనరల్ మేనేజర్ నాగ భారతిని అడిగి వివరాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలుసుకున్నారు. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక రోజు ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (పిడిఓటి) పొందుతున్న వారిని ఎమ్మెల్యే కలుసుకున్నారు. గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లే యువత సురక్షితంగా, చట్టబద్ధంగా వలస వెళ్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Next Story