- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో ఏడుపాయల.. కొచ్చేర మైసమ్మ ఆలయం స్పీకర్ : పోచారం శ్రీనివాస్ రెడ్డి
దిశ, బాన్సువాడ : నస్రుల్లాబాద్ మండల పరిధిలోని కొచ్చేరు మైసమ్మ ఆలయంను మరో ఏడుపాయలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివర్ణించారు. కొచ్చేర మైసమ్మ ఆలయం సమీపంలో మౌలిక వసతులు, నూతన కాటేజీల నిర్మాణానికి స్థలాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పరిశీలించారు. అనంతరం గిరిజన గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించే విద్యార్థుల డార్మిటరీ స్థలాన్ని సభాపతి పోచారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. కొచ్చేరు మైసమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలిపారు.
భక్తులకు అవసరమైన వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.1.35 కోట్లతో మెయిన్ రోడ్డు నుంచి లింగంపల్లితాండా వరకు తారు రోడ్డు, ఆలయం వద్ద రూ.40 లక్షలతో సీసీ రోడ్లు వేయడానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. కాటేజీల నిర్మాణానికి ఈ రోజే స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. రూ.1.50 కోట్లతో కాటేజీల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు.
అదేవిధంగా, నస్రుల్లాబాద్ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో అదనంగా మరో డార్మిటరీ నిర్మాణానికి మరియు ఎనమిది ఉపాధ్యాయుల క్వార్టర్స్ నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైందని అన్నరు. త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలపారు. హన్మాజీపేట-కోనాపూర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయడానికి గిరిజన బాలికల గురుకుల పాఠశాల మంజూరైందని తెలిపారు.
ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తామని, నియోజకవర్గంలోని నూతన మండల కేంద్రాల్లో ఒక్కోటి రూ.కోటి రూపాయలతో మండల కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో రాజగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పెరిక శ్రీనివాస్, ఎంపీపీ విఠల్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, తహసీల్దార్ బాగయ్య, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.