Gender determination : లింగ నిర్ధారణపై కొనసాగుతున్న విచారణ

by Naveena |
Gender determination : లింగ నిర్ధారణపై కొనసాగుతున్న విచారణ
X

దిశ, కామారెడ్డి : లింగ నిర్దారణపై విచారణ కొనసాగుతుందని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న రెండు స్కానింగ్ మిషన్లను సీజ్ చేసిన విషయంలో విట్టం నడిపి సిద్దిరాములు,ఆయన దగ్గర పనిచేసే పృథ్విలకు నోటీసులు జారీ చేశామన్నారు. సీజ్ చేసిన ఒక మిషన్ సిద్దిరాములు కొడుకు డా.ప్రవీణ్ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉందని, మరొక మిషన్ ఎవరి పేరున ఉందో విచారణ చేస్తున్నామని తెలిపారు. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ మిషన్లను ఉపయోగించాల్సి ఉందని పేర్కొన్నారు. రాజంపేటలో లింగ నిర్దారణ ఘటనపై విచారణ జరుగుతుందని తెలిపారు. సిద్దిరాములు వద్ద పనిచేసిన వాళ్లే మొబైల్ టీంగా ఏర్పడి ఇళ్లలో లింగనిర్దారణ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. లింగ నిర్దారణ కట్టడి విషయంలో తమ శాఖలో ఎలాంటి లోపం లేదని, ప్రజల్లో అవగాహన వస్తే తప్ప దీనిని కట్టడి చేయలేమని తెలిపారు. డా. సిద్దిరాములపై నమోదైన కేసులో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఆ సమయంలో లేనని తెలిపారు. గతంలో కేసులు నమోదు చేసి సమన్విత ఆస్పత్రిని సీజ్ చేస్తే చట్టంలో ఉన్న లొసుగుల ద్వారా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని రిలీజ్ చేసుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ సుమిత్ర నాయక్, పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story