- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్ మూర్ కు చెందిన చిట్యాల రాజేష్(29) కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గాయపడి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్ మూర్‌కు చెందిన చిట్యాల రాజేష్ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తాడు. ఇటీవల మూడు రోజుల కిందట చిట్యాల రాజేష్ అత్తమ్మ సిరిసిల్ల పక్కన గల రాత్ నగర్ లో చనిపోయింది. రాజేష్ అత్తగారింటి వద్ద ఉన్న అతని భార్య, పిల్లలను తీసుకువచ్చేందుకు వెళుతుండగా కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.
శనివారం రాత్రి 10 గంటల సమయంలో చిట్యాల రాజేష్ కోటార్ మూర్ కు చెందిన అతని స్నేహితుడు బరుకుంట నిశాంతుతో ఆటోలో రాత్‌నగర్ కు బయలుదేరారు. ఆటోలో వెళుతుండగా కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఆటోతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో చిట్యాల రాజేష్ కు తీవ్ర గాయాలు కాగా, బరుకుంట నిశాంత్ కు కొద్దిపాటి గాయాలయ్యాయి. దీంతో నిశాంత్ అదే రాత్రి సమయంలో జగిత్యాలలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. జగిత్యాల ఆస్పత్రిలో వైద్యులు అడ్మిట్ చేసుకోకపోవడంతో మొదట నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో గల అపర్ణ ఆస్పత్రికి రాగ, ఆ ఆసుపత్రిలో కూడా అడ్మిట్ చేసుకోకపోవడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. ఇందూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్మూర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడైన చిట్యాల రాజేష్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.