డాల్ఫిన్ బేకరీని తనిఖీ చేసిన శానిటరీ ఇన్​స్పెక్టర్

by Sridhar Babu |
డాల్ఫిన్ బేకరీని  తనిఖీ చేసిన శానిటరీ ఇన్​స్పెక్టర్
X

దిశ, ఆర్మూర్ టౌన్ : ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ పెట్రోల్ పంప్ ఎదురుగానున్న డాల్ఫిన్ బెంగళూరు బేకరీలో కుళ్లిన కేక్ లు విక్రయిస్తున్నారని ఫిర్యాదు మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్​స్పెక్టర్ మహేష్ శుక్రవారం తనిఖీ చేశారు. ఆర్మూర్ లో డాల్ఫిన్ బెంగళూరు బేకరీలో పుట్టినరోజు వేడుకలకు తీసుకెళ్లిన కేక్ కుళ్లిపోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ వార్త దినపత్రికలలో రావడంతో మున్సిపల్ శానిటరీ ఇన్​స్పెక్టర్ స్పందించి బేకరీలోని కేక్ లు, పలు తినుబండారాలను

తయారు చేసే వంటగదిని తనిఖీ చేశారు. వంటగది అపరిశుభ్రతగా ఉండడా న్ని పరిశీలించి దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ పదార్థాలలో వాడే నూనె సైతం పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల బాధితులతో పాటు పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బేకరీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed