దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

by Kalyani |
దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..
X

దిశ, కొత్తకోట: ఇండ్లల్లో దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకోట పట్టణంలోని విద్యానగర్ కాలనీలో తేదీ 06.10.2024 నాడు కోమల కల్లా శివ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 7 గంటలకు బుడగ జంగం రామకృష్ణ, అతని రెండవ భార్య మౌనిక వనపర్తి రోడ్ లో గుంపు గట్టు వద్ద అనుమానాస్పదంగా బైక్ పై వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. విద్యా నగర్ కాలనీలో, పాలెం గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేసినట్లు వారు ఒప్పుకున్నారు. వారి దగ్గర నుండి 1.6 తులం బంగారం, 1.5 కేజీ వెండి ని సీజ్ చేయడం జరిగిందని, సీజ్ చేసిన వస్తువుల విలువ 1,00,350/-(ఒక లక్ష 350 రూపాయలు) ఉంటుందని దొంగలను రిమాండ్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story