KTR : బీఆర్‌ఎస్వీ నాయకుల అరెస్ట్ అక్రమం.. ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం!

by Ramesh N |
KTR : బీఆర్‌ఎస్వీ నాయకుల అరెస్ట్ అక్రమం.. ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌వీ (BRSV) నాయకుల అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులా ? సమస్యలపై నిలదీస్తే నిర్బంధమా ? బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ? అని ప్రశ్నించారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడ్తారా అంటూ నిలదీశారు. (Gurukulas) గురుకుల సమస్యలపై, విద్యార్థుల ఆత్మ హత్యలపై, పిల్లల మరణాలపై గళమెత్తితే గొంతు నొక్కుతారా అని ప్రశ్నించారు.

మా బీఆర్ఎస్వీ నాయకులు గురుకుల బాట పాడుతాం అంటే అడ్డుకుంటారా ? అంటూ ప్రశ్నించారు. నిన్న అరెస్ట్ చేసి నేటికి మా విద్యార్థి నాయకుల జాడ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా? అని (Congress Govt) ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్‌ఎస్వీ నాయకుల అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం-తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story