- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదుకోట్ల అవినీతి కుంభకోణం పై ఇప్పటికీ తేలని విచారణ..
దిశ, గాంధారి, కామారెడ్డి : కలలు కన్న బంగారు తెలంగాణలో చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరిన వైనం కామారెడ్డిలో జరిగింది. ఇదేదో ఆ వ్యక్తి స్వప్రయోజనం కోసం కాదు.. వ్యవసాయ మార్కెట్ కమిటీలో దాదాపు 5 కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని ఓ వ్యక్తి తెలిపారు. అందుకు కావలసిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని 30 మే 2022 ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కరించబడలేదని అందుకే సోమవారం కలెక్టరేట్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు బాధితుడు తెలిపాడు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అడవుగల్ గ్రామానికి చెందిన సిద్ధప్ప మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు దాదాపు 5 కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉద్యమించి అక్కడ అధికారుల ద్వారా సమాచారం సేకరించానన్నారు. గత ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకువస్తే ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని.. కనీసం విచారణ కూడా జరగలేదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినందుకు తనపై స్థానిక అధికారులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా మద్నూర్ పోలీస్ స్టేషన్లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు.
అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారని అందుకే మార్కెట్ కమిటీ విచారణ జరపకపోవడానికి నిరసిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నానని అన్నాడు. మద్దూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ జరిగిన అవినీతి కుంభకోణంపై మాట్లాడుతున్నందుకు చాలారకాలుగా చిత్రహింసలు గురి చేస్తున్నారని అన్నారు. ఈ వేధింపులు తాళలేక కలెక్టర్ ను ఆశ్రయించి వచ్చారని దీనిపై సమగ్ర విచారణ జరపాలని లేదా తను ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్లను వేడుకుంటున్నాడు.