గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

by Sridhar Babu |
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డులో గల ఫారెస్టు కార్యాలయం కాంప్లెక్స్ సమీపంలో ఓ వ్యక్తి ప్లాస్టిక్ సంచిలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సీఐ దిలీప్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం వర్ని రోడ్డులోని ఫారెస్టు ఆఫీస్ పక్కన గల ఖాళీ ప్రదేశంలో నిజామాబాద్ ఏరియాకి

చెందిన షేక్ అజం అనే వక్తి ఎండు గంజాయి ఆమ్ముతున్నాడు అనే కీలక సమాచారంతో తనిఖీ చేయగా 1.315 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. దాంతో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్టు సీఐ పేర్కొన్నారు. ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ దిలీప్, ఎస్ఐ మల్లేష్, సిబ్బంది షబ్బీర్, ప్రభాకర్, సంగయా, రవి, సంజయ్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed