- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ కడుపులో ఐదు కిలోల కణితి..
దిశ, కామారెడ్డి రూరల్ : కడుపు నొప్పితో బాధ పడుతున్న ఓ మహిళ కడుపులో ప్రమాదకరంగా తయారైన 5 కిలోల కంతిని వైద్యులు తొలగించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన మామిండ్ల లక్ష్మీ అనే మహిళ గత కొద్దికాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతోంది. వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని అపెక్స్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా స్కానింగ్ చేసి కడుపులో కంతి ఉన్నట్టుగా గుర్తించారు. ఆపరేషన్ ద్వారా కంతిని తొలగించవచ్చని ఆస్పత్రి వైద్యుడు డా.నవీన్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ముగ్గురు వైద్య బృందం ఆపరేషన్ చేసి కడుపులో నుంచి 5 కిలోల కంతిని బయటకి తీశారు. ఈ సందర్భంగా డా.నవీన్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కంతులు చాలా మంది మహిళలకు గర్బసంచులకు అవుతున్నాయని ప్రతి 400మందిలో ఇలాంటివి ఒకరికి అవుతున్నాయన్నారు. కామారెడ్డిలో ఇలాంటి ఆపరేషన్ అరుదుగా జరుగుతాయని, ఈ కంతిని తొలగించడానికి వైద్యుల బృందం చాలా రిస్క్ చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిపారు.