ఇంటర్ పరీక్షల్లో ఒక్కరోజే 26 మంది పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు

by Sridhar Babu |
ఇంటర్ పరీక్షల్లో ఒక్కరోజే 26 మంది పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం అర్థశాస్త్రం, భౌతిక శాస్త్రం పరీక్షల్లో జిల్లాలో మంగళవారం 26 మంది పై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బోర్డ్ స్క్వాడ్ బృందం తనిఖీలో 16 మంది విద్యార్థుల పై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయని, అలాగే దర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9 మంది విద్యార్థులు కాపీ కొడుతుండగా

మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని హరిచరన్ జూనియర్ కలాశాలలో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ పట్టుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో 95.9 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 34 మంది విద్యార్థుల పై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 16,633 మంది విద్యార్థులకు గాను 16,136 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed