- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో 71.92 శాతం పోలింగ్.. వెల్లివిరిసిన మహిళా చైతన్యం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల పరిధిలో భాగంగా సోమవారం జరిగిన ఎన్నికల్లో 71.92 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ వివరాలను జిల్లా కలెక్టర్, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. మంగళవారం సంబంధిత వివరాలను అధికారికంగా వెల్లడించారు. దాదాపు గడిచిన పార్లమెంట్ ఎన్నికల కంటే 12 శాతం ఓట్లు అధిక మొత్తంలో పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలో సగటున 71.92 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లోని 17,04,867 మంది ఓటర్లకు గాను 12,26,133 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ లో పాల్గొన్న వారిలో మహిళా ఓటర్ల సంఖ్య 6,73,629 ఉండగా, పురుష ఓటర్లు 5,52,465 మంది, ఇతరులు 39 మంది ఓటు వేశారని తెలిపారు. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓటింగ్ ను పరిశీలిస్తే 1808 పోలింగ్ కేంద్రాల్లో ఓఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం 2,12,145 మంది ఓటర్లకు గాను 1,55,159 ఓటర్లు (73.14 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.
బోధన్ నియోజకవర్గంలో 2,23,096 మంది ఓటర్లకు గాను 1,66,330 ఓటర్లు (74.56 శాతం), నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 3,04,317 మంది ఓటర్లకు గాను 1,88,159 ఓటర్లు (61.83 శాతం), నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2,56,593 మంది ఓటర్లకు గాను 1,91,252 ఓటర్లు (74.54 శాతం), బాల్కొండ నియోజకవర్గంలో 2,26,792 మంది ఓటర్లకు గాను 1,69,524 ఓటర్లు (74.75 శాతం), కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 2,45,249 మంది ఓటర్లకు గాను 1,80,867 ఓటర్లు (73.75 శాతం), జగిత్యాల నియోజకవర్గంలో 2,36,675 మంది ఓటర్లకు గాను 1,74,842 ఓటర్లు (73 .87 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో ఉద్యోగుల, ముసలి వారు, దివ్యాంగుల ఓట్లను కలిపి లెక్కించనున్నారు. ఈ నెల 4న పోల్ అయిన ఓట్లను లెక్కించనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండలం సీఎంసీలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దాని కోసం పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించే ఈవీఎంల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.