- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానం వ్యక్తం చేసిన బండి సంజయ్.. కాంగ్రెస్ సర్కార్ ఎదుట కీలక డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఎలా గట్టెక్కిస్తారని అడిగారు. డబ్బులు లేని స్థితిలో రాష్ట్ర ఉన్నప్పుడు ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. తనలో మత్రమే కాదు.. ఇవన్నీ రాష్ట్ర ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలు అని.. వీటన్నింటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. 42 పేజీల శ్వేత పత్రాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. దీంతో విపక్ష నేతలు రకరకాలగా స్పందించారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అమలుకు సాధ్యం కానీ హామీలు ఎలా ఇస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.