NEW CRIMINAL LAWS : నేటి నుంచి అమలులోకి కొత్త నేర చట్టాలు

by Rajesh |
NEW CRIMINAL LAWS : నేటి నుంచి అమలులోకి కొత్త నేర చట్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి దేశవ్యాప్తంగా మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రానున్నాయి. న్యాయవ్యవస్థలో విస్తృత మార్పులు, వలసవాద కాలం నాటి చట్టాలకు ముగింపు పలకాలనే లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాలను అమలులోకి తెచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అమలులోకి వచ్చాయి. కేసుల ఫిర్యాదు, నమోదులోనూ అమల్లోకి కొత్త నిబంధనలు వచ్చాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. అమలులోకి ఎలక్ట్రానిక్ పద్ధుతుల్లో సమన్లు జారీ చేసే విధానం వచ్చింది. క్రూరమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని వీడియో తీయడం కూడా తప్పనిసరి చేశారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో సెక్షన్లను 358కి కుదించారు.

Next Story

Most Viewed