కెనడా ఓపెన్ నుంచి తప్పుకున్న లక్ష్యసేన్

by Harish |
కెనడా ఓపెన్ నుంచి తప్పుకున్న లక్ష్యసేన్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం నుంచి ఈ టోర్నీ ప్రారంభమైంది. ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్యసేన్ ఫ్రాన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. గతేడాది కెనడా ఓపెన్ టైటిల్‌ను లక్ష్యసేన్ దక్కించుకున్నాడు. ఇదే అతని చివరి టైటిల్ కూడా.

ఫ్రెంచ్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నీలో సెమీస్‌కు చేరుకోవడం ద్వారా లక్ష్యసేన్ తన తొలి ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. లక్ష్యసేన్ తప్పుకోవడంతో కెనడా ఓపెన్ టోర్నీలో యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ భారత బృందాన్ని నడిపించనున్నాడు. తొలి రౌండ్‌లో అతను రాస్మస్ జెమ్కే(డెన్మార్క్)తో తలపడనున్నాడు. మరోవైపు, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ బై పొందింది. నేరుగా రెండో రౌండ్‌కు చేరుకుంది.

Next Story

Most Viewed