BREAKING: కొత్త చట్టాలతో సామాన్యులకు న్యాయం జరగదు: ఎంపీ అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

by Shiva Kumar |
BREAKING: కొత్త చట్టాలతో సామాన్యులకు న్యాయం జరగదు: ఎంపీ అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 1 నంచి దేశ వ్యాప్తంగా కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో విపక్షాలు లోక్‌సభ వేదిక ఆందోళనకు పిలుపునిచ్చారు. చట్టాలపై సభలో అసలు చర్చే జరగలేదని ఏక పక్షంగా అధికార బీజేపీ బిల్లును అమలు చేసిందంటూ సభ్యులు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త చట్టాలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాలతో సామాన్య ప్రజలకు న్యాయం జరగదని తేల్చేశారు. ఐపీసీ, సీఆర్పీసీని బ్రిటిష్‌ చట్టాలన అనడం సమంజసం కాదని అన్నారు. గతంలో సామాన్యులు ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. కొత్త చట్టాల అధారంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన బాధితులు 15 రోజుల గడిచినా ఎఫ్‌ఐఆర్‌పై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని అన్నారు. ఈ క్రమంలో నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందా లేదా అనేది కూడా చెప్పే పరిస్థితులు ఉండవని ఓవైసీ తెలిపారు.

Next Story

Most Viewed