Water Fasting : మూడు రోజులు నీళ్లు మాత్రమే తాగితే శరీరానికి ఏం జరుగుతుంది?

by Sujitha Rachapalli |
Water Fasting : మూడు రోజులు నీళ్లు మాత్రమే తాగితే శరీరానికి ఏం జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ ట్రెండ్ నడుస్తోంది. 24-72 గంటల వరకు కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ.. ఫుడ్ అవాయిడ్ చేయడాన్ని నీటి ఉపవాసం అంటారు. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారని చెప్తుంటారు. అయితే నిజంగానే దీనివల్ల లాభాలున్నాయా? బాడీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుసుకుందాం.

నిజానికి వాటర్ ఫాస్టింగ్ అనేది బాడీ డిటాక్సిఫికేషన్, ట్రీట్మెంట్ తీసుకునేముందు ఫాలో అవుతారు. కానీ ప్రస్తుతం మాత్రం బరువు తగ్గాలనుకునే ప్రయత్నంలో భాగంగా మారింది. కానీ గట్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులు దీన్ని అసలు ఫాలో కాకూడదని చెప్తున్నారు నిపుణులు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, టీనేజర్స్ కూడా దూరంగా ఉండాలని అంటున్నారు. అంతేకాదు నీటి ఉపవాసం ప్రారంభించే ముందు ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తూ రావాలి. బాడీ దానికి అలవాటు అయ్యేలా చూసుకోవాలి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

లాభాలు

* వాటర్ ఫాస్టింగ్ ఆటోఫాగిని ఎంకరేజ్ చేస్తుంది. అంటే శరీరంలో దెబ్బతిన్న కణాల సహజ క్షీణతకు దారితీస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* నీటి ఉపవాసం హైబీపీ ఉన్నట్లయితే కంట్రోల్ చేస్తుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నుంచి కాపాడుతుంది.

నష్టాలు

* ప్రస్తుతం వాటర్ ఫాస్టింగ్ ట్రెండింగ్ లోకి వచ్చిందే బరువు తగ్గాలనుకునే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉండటం వల్ల. కానీ దీన్ని ఫాలో అయిపోతే వెయిట్ రాంగ్ వేలో కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే ఫ్యాట్ కు బదులు కండర ద్రవ్యరాశిని కోల్పోతారు.

* హెల్త్ లైన్ ప్రకారం శరీరానికి 20-30 శాతం నీటి సరఫరా మనం తీసుకునే ఆహారం ద్వారానే వస్తుంది. కాబట్టి కేవలం నీరు మాత్రమే తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు. దీంతో నిలబడి ఉన్నప్పుడు ఆకస్మిక మైకం లేదా మూర్ఛ సంభవిస్తుంది. ఇంతకు ముందు హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే పరిస్థితి మరింత దిగజారుతుంది.

నోట్.. వాటర్ ఫాస్టింగ్ ముగించిన వెంటనే పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే పొట్టలో అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి చిన్న మొత్తంలో పండ్లు తీసుకోవడం స్టార్ట్ చేయడం బెటర్ అని సూచిస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed