- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ టార్గెట్‌గా తెలంగాణలో కొత్త పొత్తులు.. రంగంలోకి చంద్రబాబు!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం రోజు రోజుకూ హీటెక్కుతున్నది. మరో ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ పార్టీల మధ్య పొత్తుల అంశం హాట్ టాపిక్ అవుతున్నది. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన కారు గుర్తు పార్టీ నేతలు మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కొడుతామని ధీమాతో ఉండగా.. అందంతా ఈసారికి కుదరని కారును షెడ్డుకు పంపడం ఖాయం అని ప్రతిపక్షాలు సవాల్ చేస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రంజుగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన తాజా ప్రకటన అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ ఉత్కంఠ రేపుతున్నది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ అంతిమ లక్ష్యం అన్నట్లుగా కేసీఆర్ బీఆర్ఎస్ రూపంలో రాజకీయం చేస్తుంటే ఇన్నాళ్లు విభేదించిన చంద్రబాబు నాయుడు అనూహ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పొత్తుకోసమే బాబు వ్యాఖ్యలా?
తెలంగాణలో గెలుపుపై కమలనాథులు కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని అందువల్ల మరికాస్త శ్రమిస్తే కేసీఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయం అనే చర్చ ఆ పార్టీలో జరుగుతున్నది. ఈ క్రమంలో ఉద్యమకారులు, మేధావులు, యువత, సబ్బండ వర్గాలను ఆకట్టుకునేల వివిధ కార్యక్రమాలను కాషాయ పార్టీ చేపడుతోంది. ఈ క్రమంలో పార్టీల మధ్య పొత్తు అంశంపై కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ విధానాలను ప్రశంసించడం వెనుక భారీ వ్యూహం ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ ఎటాక్ ప్రారంభించింది. చంద్రబాబు, బీజేపీ కలిసి వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని కాకుంటే తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించేందుకు చంద్రబాబు సహకారం బీజేపీ తీసుకుంటే తీసుకునే అవకాశం ఉందని వాదిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు మోడీని ఆకాశానికెత్తుతున్నాడనే విమర్శలు వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు అర్జెంట్‌గా తెలంగాణలో టీడీపీని పెంచే పనిని నెత్తిన వేసుకున్నాడని, కాసాని వంటి నేతలను రంగంలోకి దింపి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడుతున్నారు.
టార్గెట్ కేసీఆర్?:
ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీతో విభేదించిన చంద్రబాబు తాజాగా బీజేపీకి మద్దతుగా నిలవడం వెనుక టార్గెట్ కేసీఆర్ ఉన్నారనే చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీడీపీకి కొన్ని చోట్ల చెప్పుకోదగ్గ క్యాడర్ బలం ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే ఫలితాలను సైతం తారుమారు చేయగల శక్తి తెలుగు తమ్ముళ్లదనే టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ ఏపీలో ఎంట్రీ కావాలని చూడటం చంద్రబాబుకు ఇబ్బందికరం అయ్యే పరిస్థితి ఉందని దాంతో ఆయన వ్యూహాత్మకంగా తెలంగాణలో బీజేపీతో పొత్తుకు వెళ్లే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతున్నది. అయితే తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలోనూ పొత్తు కొనసాగుతుందా లేక అక్కడ సింగిల్ గానే పోటీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఏపీలో మాత్రం సింగిల్ గా బరిలోకి దిగాడు. ఈ సారి కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర అవసరాల దృష్య్టా పాలిటిక్స్ చేయబోతున్నారా అనేది తేలాల్సి ఉంది. పొత్తుల విషయంలో చంద్రబాబు నిజంగానే బీజేపీకి దగ్గర అవ్వాలని చూస్తే ఆయన్ను కమలనాధులు మేరకు అక్కున చేర్చుకుంటారనేది కూడా ముఖ్యమైన అంశంమే. గత ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికి తమ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గెలుపు కోసం ఒక వేళ చంద్రబాబును పక్కన చేర్చుకుంటే తెలంగాణ ఓటర్లు అంగీకరిస్తారా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతే జనసేన విషయం ఏంటనేది మరో ప్రశ్న.
Read more:
నేతలకు సీఎం కేసీఆర్ క్లాస్.. వారికే టికెట్లు ఇస్తామని స్ట్రాంగ్ వార్నింగ్