ఇంతకంటే రుజువు కావాలా రాహుల్? : మంత్రి KTR ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-01 03:50:05.0  )
ఇంతకంటే రుజువు కావాలా రాహుల్? : మంత్రి KTR ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై అధికార అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మరోసారి మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కాంగ్రెస్ గుండా పనేనని ఆరోపించారు. మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిందితుడు గట్టని రాజు కాంగ్రెస్ కండువాతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. నిందితుడు కాంగ్రెస్ వ్యక్తే అనడానికి ఇంతకంటే రుజువులు కావాలా అని రాహుల్ గాంధీని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. కాగా ఎంపీపై దాడి వెనుక ఉన్నది ఎవరు? నిందితుడు ఎందుకు హత్యాయత్నానికి పాల్పడ్డాడు అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed