పీపుల్స్ ప్లాజాలో శారీ రన్.. నారా బ్రాహ్మణితో సెల్పీలు

by Ramesh N |
పీపుల్స్ ప్లాజాలో శారీ రన్.. నారా బ్రాహ్మణితో సెల్పీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పీపుల్స్ ప్లాజాలో ఇవాళ ఉదయం శారీ రన్ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. చీర కట్టడం సంప్రదాయం తో పాటు స్త్రీలకు గుర్తింపును తీసుకు వస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బ్రాహ్మణితో సెల్పీలు తీసుకుంటూ సందడి చేశారు. కాగా, తనైరా సంస్థ, ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో శారీ రన్ నిర్వహించారు. అన్ని వర్గాల మహిళలను ఏకతాటిపైకి తీసుకురావాలని లక్ష్యంగా శారీ రన్ నిర్వహించారు.

Advertisement

Next Story