- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరెస్టుతో ప్రజల్లో చంద్రబాబు ఆదరణ తగ్గించలేరు: నందమూరి సుహాసిని
దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారని టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుహాసిని ఆరోపించారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆ పార్టీ అనుబంధం సంఘమైన టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మౌనప్రదర్శన చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ.. అరెస్టుతో చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ తగ్గించలేరన్నారు.
ఏపీ సీఎం జగన్ కక్షపూరితంగానే కేసులు పెట్టి జైల్లో వేశారని ఆరోపించారు. తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురిచేయాలని చూడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే కాలంలో ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు. బాబును క్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ సిటీని, హైటెక్ సిటీ నిర్మించారన్నారు. ఏపీలో సైతం అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బోస్, నాయకులు పాల్గొన్నారు.