- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nampally: భారీ వర్షాల కారణంగా తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాల కారణంగా తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు గడువు మరోసారి పెంచింది. ఈ మేరకు నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో గవర్నమెంట్, ప్రైవేట్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వేల్పేర్ సహా ఇతర జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ 2024-25 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువు తేదీని ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. దీంతో సెప్టెంబర్ 15 తేదీ వరకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు తీసుకోవాలని జూనియర్ కాళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించింది. అలాగే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను acadtgble.cgg.gov.in లేదా TGBIE అధికారిక వెబ్ సైట్ లో చూడాలని వివరించింది. కాగా పలు కారణాలతో ఇదివరకే రెండు సార్లు గడువు పెంచిన ఇంటర్ బోర్డు.. భారీ వర్షాల కారణంగా మరోసారి పెంచింది.