- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ : నామా నాగేశ్వరరావు
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యకు పరాకాష్ట అని మండిపడ్డారు. అక్రమాలను ప్రశ్నిస్తారనే భయంతోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అన్యాయమన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు తిలోదాకాలిచ్చిందన్నారు.
భారత దేశ చరిత్రలో చీకటి రోజు అని, బీజేపీ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలన్నారు. దర్యాప్తు సంస్థల అండతో కేంద్రం ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలంతా త్వరలోనే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని, బీజేపీ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్య దురదృష్టకరం అన్నారు.