- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
OpenAI: ఓపెన్ఏఐపై కాపీరైట్ దావా వేయనున్న టీ-సిరీస్, సరిగమ, సోనీ మ్యూజిక్

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌కు చెందిన మ్యూజిల్ లేబుల్ కంపెనీలు అమెరికాకు చెందిన ఏఐ కంపెనీ ఓపెన్ఏఐపై కోర్టు మెట్లెక్కనున్నాయి. టీ-సిరీస్, సరిగమ, సోనీ మ్యూజిక్‌తో సహా దేశంలోని ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ లేబుల్ కంపెనీలు ఓపెన్ఐకి వ్యతిరేకంగా కాపీరైట్ దావా వేయాలని భావిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సౌండ్ రికార్డులను అనధికారికంగా ఉపయోగించడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఓపెన్ఏఐ తమ సౌండ్ రికార్డింగ్‌లను ఉపయోగిస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా ఓపెన్ఏఐ తమ కంటెంట్‌ను వాడుతోందని గతేడాది జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ దావా వేసింది. తాజాగా ఈ కేసులో మ్యూజిల్ లేబుల్ కంపెనీలు కలిసి పోరాడాలని నిర్ణయించాయి. వీటితో పాటు పలు పుస్తక ప్రచురణకర్తలు, మీడియా సంస్థలు కోర్టులో దావా వేశాయి. దీంతో ఈ వ్యవహారంలో ఓపెన్ఏఐకు చట్టపరమైన సవాళ్లు పెరిగాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కంపెనీపై కేసులు నమోదవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ మద్దతున్న ఓపెన్ఏఐ న్యాయంగానే పబ్లిక్‌గా ఉన్న డేటాను వాడుతున్నట్టు చెబుతోంది. అయితే, ఓపెన్ఏఐ కార్యకలాపాలు తప్పనిసరిగా భారతీయ కాపీరైట్ చట్టాలకు లోబడే మనదేశంలో పనిచేయాలని కంపెనీలు వాదిస్తున్నాయి.