'పాకిస్తాన్ హైకమిషన్ చెప్పినట్లే లోక్‌సభలో ప్రశ్నలు వేస్తాడు'

by John Kora |
పాకిస్తాన్ హైకమిషన్ చెప్పినట్లే లోక్‌సభలో ప్రశ్నలు వేస్తాడు
X

- కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు

- లీగల్ యాక్షన్ తీసుకుంటానన్న గొగోయ్

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో డిప్యూటీ అపోజిషన్ లీడర్ గౌరవ్ గొగోయ్‌పై ఆరోపణలను బీజేపీ మరింత తీవ్రతరం చేసింది. ఇప్పటికే గొగోయ్ భార్య ఎలిజబెత్‌కు ఐఎస్ఐకి లింకులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే గౌరవ్ గొగోయ్ లోక్‌సభలో ప్రశ్నలు అడుగుతారని శుక్రవారం బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల లోక్‌సభలో సముద్ర భద్రత గురించి గౌరవ్ గొగోయ్ ప్రశ్న అడిగారు. అది పాకిస్తాన్ హైకమిషన్ ఆదేశాల మేరకే ప్రశ్నించారని బీజేపీ ఆరోపించింది. కాగా బీజేపీ వ్యాఖ్యలపై గొగోయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. బీజేపీపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. 'బీజేపీ నన్ను, నా కుటుంబాన్ని అగౌరవపరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వాళ్ల ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి, హానికరమైనవవి. నేను వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాను' అని గౌరవ్ గొగోయ్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గౌరవ్ గొగోయ్‌ని ఎలిజబెత్ పెళ్లిచేసుకోక ముందు ఐఎస్ఐ మద్దతురాలిగా ఉన్నారని అన్నారు. ఆమె పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అలీ తౌఖీర్ షేక్‌తో కలిసి పని చేసినట్లు చెప్పారు. ఆమెను పెళ్లి చేసుకోక మునుపు గౌరవ్ గొగోయ్‌కి ఈ విషయం తెలుసా? లేదంటే ఇది వ్యూహాత్మక వివాహమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తప్పకుండా ఈ అంశంలో వివరణ ఇవ్వాలి. కానీ ఆ పార్టీమొదటి నుంచి యాంటీ నేషనల్ అని అలోక్ ఆరోపించారు.

Next Story

Most Viewed