- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BSNL: 17 ఏళ్ల తర్వాత లాభాలు చూసిన బీఎస్ఎన్ఎల్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 17 ఏళ్ల తర్వాత లాభాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి బీఎస్ఎన్ఎల్ రూ. 262 కోట్లను సాధించింది. దీంతో 2007 తర్వాత సంస్థ తొలిసారిగా లాభాలను చూసింది. కొత్త ఆవిష్కరణలు, వేగవంతమైన నెట్‌వర్క్ విస్తరణ, ఖర్చుల తగ్గింపు, కస్టమర్ ఆధారిత సేవలను మెరుగుపరచడం ద్వారా కంపెనీ రాబడిని నమోదు చేసింది. గతేడాది ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచిన తర్వాత చాలామది సబ్‌స్క్రైబర్లు బీఎస్ఎన్ఎల్‌కు మారారు. 2024, జూన్‌లో బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 8.4 కోట్ల నుంచి డిసెంబర్ నాటికి 9 కోట్లకు చేరుకుంది. ఇది కూడా సంస్థకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో 4జీ నెట్‌వర్క్ సేవలు ప్రారంభించడం, 75 వేల టవర్లను ఏర్పాటు చేయడం, ఖర్చులను తగ్గించుకోవడం కూడా కలిసొచ్చిందని కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. సంస్థ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి సంస్థ ఆదాయం మరింత మెరుగుపడుతుందని, 20 శాతానికి మించి ఉండొచ్చని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ రాబర్ట్ జె రవి పేర్కొన్నారు.