- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
DeepaDas Munshi : దీపాదాస్ మున్షీ అవుట్.. కారణం ఇదేనా!

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్‌పార్టీ ఏఐసీసీ ఇంఛార్జి(Telangana AICC In-charge)గా ఉన్న దీపాదాస్ మున్షీ(DeepaDas Munshi) స్థానంలో మీనాక్షీ నటరాజన్(Meenakshi Natarajan)ను నియమించింది ఏఐసీసీ. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఐసీసీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) టీమ్‌లో మీనాక్షి నటరాజన్కీలక సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పార్టీలో ఎన్ఎస్యూఐ(NSUI) నుంచి ఆమె కొనసాగుతున్నారు. పార్టీ, ప్రజాప్రతినిధిగా అనేక పదవులు ఆమె నిర్వర్తించారు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ ప్రాంతానికి చెందిన మీనాక్షి నటరాజన్ 2009 నుండి 2014 వరకు మాండ్సౌర్ నుంచి లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగారు. ఆమె 1999–2002 వరకు ఎన్ఎస్యూఐ అధ్యక్షురాలిగా పనిచేశారు. మీనాక్షి 2002-2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతానికి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న దీపాదాస్మున్షీ స్థానంలో మీనాక్షి నియమించబడ్డారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షీ 2023 డిసెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు.
అప్పటి నుంచి ఆమె ఇంచార్జిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె తన పరిధి దాటి వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పార్టీ వ్యవహరాలే కాకుండా ఇక్కడి కీలక అధికారులకు ఆమె నేరుగా ఫోన్లు చేయడం, పలు నిర్ణయాలు తీసుకునే విధంగా ఒత్తిడి చేయడం, మంత్రుల శాఖ పరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం, నామినెటెడ్ పోస్టుల్లోనూ ఆమె అతి జోక్యంపై పార్టీ కీలక నాయకులందరు ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను తెలంగాణ నుంచి మార్చాలంంటూ కొన్నాళ్లుగా పార్టీ పెద్దలకు నేరుగానే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా ఆమెను మారుస్తారు, కొత్త వారు ఇంఛార్జిగా నియమితులు కానున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు పార్టీ అధిష్ఠానం ఆమెను మార్చింది. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి మున్షీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా నియమించినట్లు తెలిసింది.