- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tata Sons: టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌కు బ్రిటన్ ప్రతిష్టాత్మక పురస్కారం

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూకె-భారత్ వ్యాపార సంబంధాలకు అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం గౌరవ నైట్‌హుడ్ పురస్కారం ప్రదానం చేసినట్లు గ్రూప్ శుక్రవారం తెలిపింది. ఈ పురస్కారాన్ని వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన విదేశీ పౌరులకు యూకే ప్రభుత్వం అందజేస్తుంది. నైట్‌హుడ్ పురస్కారం లభించడం పట్ల స్పందించిన చంద్రశేఖరన్.. యూకే ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పురస్కారం దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. టెక్నాలజీ, వినియోగదారు, ఆతిథ్య, ఉక్కు, రసాయన, ఆటోమోటివ్ రంగాలలో యూకేతో బలమైన వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించడం టాటా గ్రూప్‌నకు గర్వకారణమని అన్నారు. వీటితో పాటు జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ లాంటి బ్రిటీష్ బ్రాండ్లను కూడా నిర్వహించడం సంతోషంగా ఉంది. యూకేలో తమ సంస్థ 70,000కి పైగా ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వార్విక్ యూనివర్శిటీ, స్వాన్సీ యూనివర్శిటీ లాంటి యూకేలోని గొప్ప సంస్థలతో టాటా గ్రూప్ విజయవంతమైన, ప్రపంచ స్థాయి పరిశోధన, విద్యా భాగస్వామ్యాలను కలిగి ఉండటం ఆనందంగా ఉందని చంద్రశేఖరన్ వెల్లడించారు.