- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ రెండు శాఖలకు తక్కువ కేటాయింపులు: బడ్జెట్‌పై మల్లన్న మండిపాటు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులలో విద్య , వైద్యశాఖలకు తక్కువ కేటాయింపులు జరిగాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం తెలిపినట్లు రైజింగ్ తెలంగాణలో ప్రపంచంతో పోల్చడం లేదని, పక్క రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళలతో పోల్చినపుడు విద్యా, వైద్య శాఖలకు కేటాయింపులు తక్కువేనన్నారు. బడ్జెట్ ఎంత జనాభాకు కేటాయించారో తెలిపాలని డిమాండ్ చేశారు. ఒక నివేదికలో రాష్ర్ట జనాభా 3.79కోట్లు ఉందని , సోషియో ఎకానామిక్ నివేదికలో 4.20కోట్ల జనాభా ఉందని, బడ్జెట్ కేటాయింపు ఏ జనాభాకు జరిగిందే అర్ధం కావడంలేదని విమర్శలు చేశారు. గురుకుల విద్యార్ధులకు పోషికాహరం అందిచే విషయంలో బడ్జెట్ పెంచాలన్నారు. జైళ్లలో ఉన్న ఖైదీలకు రోజులకు రూ.85 కేటాయిస్తున్నారని , పోలీసుల జాగిలాలకు రూ15వేలు ఖర్చు చేస్తాన్నారని , విద్యార్ధుల విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తుందని తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో రూ.59వేల కోట్లు కేటాయించారని ప్రస్తుత బడ్జెట్‌లో రూ.32వేల కోట్లు మాత్రమే కేటాయించారని మల్లన్న గుర్తు చేశారు.