- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Kundur Raghuveer Reddy :పార్టీ మంచి కోసం పని చేయాలి..కానీ విమర్శలకు పాల్పడవద్దు
దిశ, మిర్యాలగూడ :ఏ ఒక్కరు ఓట్లు వేస్తేనే ఎవరు గెలవరని..అందరూ కలిసి ఓట్లు వేస్తేనే గెలుస్తారని నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి( MPKundur Raghuveer reddy)అన్నారు. సోమవారం దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో బంగారు మైసమ్మ తల్లి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఒక రాజకీయ పార్టీలో పార్టీ బలోపేతం కోసం కృషి చెయ్యాలి తప్ప కించపరిచే విధంగా మాట్లాడకూడదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన కింది స్థాయి కార్యకర్తలకు అసహనంతో పాటు అయోమయానికి గురవుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్న విషయం అధిష్టానం, పిసిసి అధ్యక్షులు ఆలోచన చేస్తారని అ:ఏ ఒక్కరు ఓట్లు వేస్తేనే ఎవరు గెలవరని..అందరూ కలిసి ఓట్లు వేస్తేనే గెలుస్తారని నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు.న్నారు. అంతకుముందు దేవాలయ పాలకవర్గ సమావేశంలో బంగారం మైసమ్మ దేవాలయాన్ని రానున్న రెండు సంవత్సరాలలో ప్రభుత్వం ఎండోమెంట్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈ దేవాలయానికి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని పెద్ద దేవాలయాలకు దీటుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు నేను ఎమ్మెల్యే సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ గా దస్రు నాయక్ తో పాటు 13 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.