- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలు పితకడానికి వెళ్లిన మహిళ.. తిరిగి రాని లోకాలకు..
by Sumithra |
X
దిశ, నాగారం : మండలం ఈటూరు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రగతినగర్ లో గంట గీత (48) ఆదివారం రాత్రి విద్యుత్ షాక్కు గురై మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రగతి నగర్ కి చెందిన గంట గీత రోజువారీగా రాత్రిపూట పాలు పిండటం కోసం ఇంటి ముందు గేదెల షెడ్డు దగ్గరికి వెళ్తూ గోళెంలోకి నీళ్లు రావటానికి గేట్ వాల్ ను ఆన్, ఆఫ్ చేస్తుంది.
ఈ క్రమంలోనే రేకులకు ఆనుకొని ఉన్న ఇనుప పైపును పట్టుకొని గేట్ వాల్ ఆన్ ఆఫ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం తెల్లవారు జామున పాల కోసం వారి ఇంటికి వెళ్లగా చనిపోయినట్లు తెలిసిందని స్థానికులు తెలిపారు. మృత దేహానికి శవ పరీక్ష చేయించడానికి తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని నాగారం ఎస్ఐ ఎం.ఐలయ్య తెలిపారు.
Advertisement
Next Story