- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Skin care Tips: ప్యాచీ స్కిన్ పోగొట్టే బెస్ట్ రెమిడీస్..!
దిశ, ఫీచర్స్: ఈ చలికాలంలో చాలామందికి చర్మం గరుకుగా మారి పగుళ్లు ఏర్పడుతాయి. దీని వల్ల చర్మంపై దురద, చిరాకు వంటి సమస్యలు వస్తాయి. చల్లటి వాతావరణం, గాలిలో తేమశాతం తక్కువగా ఉండడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. వీటిని తొలగించుకునేందుకు చర్మాన్ని స్క్రబ్, మాయిశ్చరైజ్ చేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మచ్చలు తొలగిపోయి, మృదువుగా మారుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
టోనర్: చర్మం తేమ సామర్థ్యాన్ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆర్గానిక్ రోజ్ వాటర్‌ని ముఖంపై స్ప్రే చేసి, దాన్ని 5 నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత శుభ్రమైన నీళ్లతో కడగాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ సాఫ్ట్‌గా మారుతుంది.
క్లెన్సర్: ఇంట్లో ఉండే పాలు చర్మానికి క్లెన్సర్‌గా పనిచేస్తాయి. ముందుగా పాలు తీసుకుని అందులో కొంచెం పసుపు కలిపాలి. ఆ తరువాత మెత్తని దూదిని తీసుకుని ఆ పాలలో ముంచి ముఖాన్ని సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత దీనిని శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని మృదువుగా మార్చి, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.
మాశ్చరైజర్: చర్మంపై ఉన్న మచ్చలకు, పొడిబారిన చర్మానికి మాశ్చరైజర్ చాలా అవసరం. దీని కోసం జోజోబా నూనెను వాడడం మంచిది. ఈ ఆయిల్ చర్మానికి యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తుంది. దీనిని ప్రతి రోజూ వాడడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలను తగ్గించి, చర్మాన్ని మెరిపిస్తుంది.
సీరం: కోల్డ్ ప్రెస్డ్ వాల్‌నట్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు ఈ సీరంతో ముఖం, మెడ చుట్టూ మసాజ్ చేయడం వల్ల ఫైన్ లైన్స్ తగ్గుతాయి.
ఫేస్ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, మూడు టేబుల్ స్పూన్ల పాలు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దీనిని ముఖంపై రాసుకొని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది పొడిబారిన చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. స్కిన్‌పై ఉన్న దురద, మంట సమస్యలు తగ్గుతాయి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Asthma treatment: ఆస్తమాకు కొత్త చికిత్స.. 50 ఏళ్ల తర్వాత మరో కొత్త విధానం