పబ్బుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు : కుషాయిగూడ ఏసీపీ

by Aamani |
పబ్బుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై  కఠిన చర్యలు :  కుషాయిగూడ ఏసీపీ
X

దిశ, మల్కాజిగిరి : పబ్బుల్లో మాదకద్రవ్యాల వినియోగం పై కఠిన చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఏసీపీ మహేష్ హెచ్చరించారు. నేరేడ్ మెట్ ఠాణా పరిధిలో నిర్వహిస్తున్న కైరో, అర్బన్ హౌస్ పార్టీ,10డీ, హీరో జో రాత్రి సమయంలో నిర్వహిస్తున్న పబ్బులను ఏసీపీ మహేష్, నేరేడ్ మెట్ ఇన్ స్పెక్టర్ సందీప్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగంపై నిర్వాహకులను ఆరా తీశారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని పసిగట్టే నార్కోటిక్ డాగ్ తో ముమ్మర తనిఖీ చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలు వివరించి చట్టరీత్యా శిక్షించే చర్యలపై పబ్బుల యజమానులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ సంస్కృతిని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని హెచ్చరించారు. పబ్బులకు వచ్చే కొత్త వారిపై నిఘా ఉంచాలని, రాత్రుల్లో నిర్ణీత సమయానికి పబ్బులను మూసి వేయాలని కోరారు.

Advertisement

Next Story