ప్రజావాణిలో ఫిర్యాదులు కరువు

by Kalyani |
ప్రజావాణిలో ఫిర్యాదులు కరువు
X

దిశ, చార్మినార్ : ప్రజావాణిలో తమకు అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు. జోనల్ కమిషనర్ వెంకన్న పర్యవేక్షణ లో సోమవారం చాంద్రాయణ గుట్ట నర్కి పూల్ బాగ్ లోని జోనల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ... ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చెప్పట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సంబంధిత విభాగాలతో తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జోన్ పరిధిలోని బస్తీలు, కాలనీలలో స్థానికంగా నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, యుబిడి డిప్యూటీ డైరెక్టర్ అమీనా బి, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సీ పి మహమ్మద్ అబ్దుల్ మజీద్, ఎ. యం సీ రాజారావు, ఎలక్ట్రికల్ ఈఈ రామారావు, బిల్ కలెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed