Adivi Sesh: సౌత్ సినిమాలపై నెటిజన్ వెటకారం.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన అడివి శేష్ (ట్వీట్)

by Hamsa |
Adivi Sesh: సౌత్ సినిమాలపై నెటిజన్ వెటకారం.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన అడివి శేష్ (ట్వీట్)
X

దిశ, సినిమా: సినిమాలు హిట్ అయినప్పటికీ కొంతమంది తమ నెగిటివ్ రివ్యూ(Negative review)లు ఇస్తూ పలు పోస్టులు షేర్ చేస్తుంటారు. లేదా కొంతమంది తెలుగు చిత్రాలను చులకనగా చూస్తూ దారుణమైన కామెంట్స్ పెడుతుంటారు. అవి కాస్త హీరోల దృష్టికి వెల్లడంతో వారు స్పందిస్తుంటారు. తాజాగా, ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఓ నెటిజన్ సౌత్ సినిమాలపై వెటకారంగా పోస్ట్ పెట్టాడు. ‘‘దక్షిణాది చిత్రాలలో ఫార్ములా ఏంటంటే.. శుచీ, శుభ్రత లేని వ్యక్తం ఆత్మనూన్యతతో బాధపడుతూ ప్రేమించిన అమ్మాయి కోసం పది వేల మంది మల్ల యోధులను మట్టి కురిపిస్తాడు. ఇదంతా దేనికంటే స్వంత తెలివి లేని అందమైన ప్రియురాలిని మెప్పించేందుకే అంట’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ చూసిన టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘ వివక్షా పూరితమైన కామెంట్స్ చేసే బదులు అమెరికా, జపాన్‌లలో సౌత్ సినిమాలకు వస్తున్న ఆదరణ చూసి తెలుసుకోండి’’ అని రాసుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed