- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sunil Gavaskar : హేజిల్‌వుడ్ దూరమవడం మిస్టరీయే.. : సునీల్ గవాస్కర్
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 6 నుంచి జరగనున్న అడిలైడ్ టెస్ట్‌కు బౌలర్ హేజిల్ వుడ్ గాయం కారణంగా దూరం అయిన విషయం తెలిసిందే. అయితే హేజిల్‌వుడ్ రెండో టెస్ట్‌కు దూరమవడం మిస్టరీయే అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘ఆస్ట్రేలియా జట్టులో భయాందోళన నెలకొంది. పెర్త్ టెస్ట్‌లో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హేజిల్‌వుడ్ ఇబ్బంది పడినట్లు కనిపించలేదు. కానీ రెండో టెస్ట్‌కు దూరమైన ఈ పేస్ బౌలర్ సైడ్ స్ట్రెయిన్ కారణంగా సిరీస్‌కు సైతం దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియా జట్టులో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో భారత క్రికెట్‌లో చూశాను. ప్రస్తుతం ఆసీస్‌లో చూస్తున్నాను.’ అని గవాస్కర్ అన్నాడు. 2020-21లో అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి భారత్ 36 పరుగులకు ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో టెస్ట్‌లో స్కాట్ బోలాండ్‌ను ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11కు ఆడించే అవకాశం ఉంది.