ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్

by Kalyani |
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి :  కలెక్టర్
X

దిశ, సంగారెడ్డి : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 43 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్ఓ పద్మజ రాణి లకు అర్జీలు సమర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed