Tribal Welfare: గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తాం..

by Nagam Mallesh |
Tribal Welfare: గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తాం..
X

దిశ, నల్లగొండ : వివిధ పథకాల కింద షెడ్యూల్డ్ తెగల లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించిందని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు. అయన నల్గొండ జిల్లా కేంద్రంలో షెడ్యూల్ తెగల అభివృద్ధికై జిల్లాలో అమలు చేస్తున్న పథకాలపై గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గిరిజనల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, వారికి కల్పించాల్సిన సౌకర్యాల పై చర్చించే నిమిత్తం జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈనెల 30న హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో గిరిజన సంఘాల నాయకులతో చర్చించి, 31న గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నట్టు తెలిపారు. అక్టోబర్ లో ఆర్థిక చేయూత, చిన్న మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహ పథకం, భూమి అభివృద్ధి పథకాల కింద లబ్ధిదారుల ఎంపికై నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు. నెలలోపు ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి నవంబర్లో వారికి ఆర్థిక సహాయం అందించనున్నట్లుతెలిపారు. గిరిజనులకు పోడు భూములపై ఆయన మాట్లాడుతూ చట్టప్రకారం దున్నుకొంటున్నవారికి భూములు ఇస్తామని, గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఇచ్చినట్టు గుర్తు చేశారు. జిల్లా గిరిజన సంక్షేమ ఇంచార్జ్ అధికారి, హోసింగ్ పి డి రాజ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, ఆర్డిఓ రవి, డీఎస్పీ శివరాం రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed