వరద బాధితులకు అండగా ఉంటాం

by Sridhar Babu |
వరద బాధితులకు అండగా ఉంటాం
X

దిశ, నడిగూడెం : వరద బాధితులకు అండగా ఉంటాం అని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీలను, వరద కాలవను బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మండల కేంద్రంలో ప్రతి ఏడాది వరదలు వచ్చినప్పుడు గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలు నీటిలో మునిగిపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు నిధులు మంజూరు చేస్తామన్నారు.

ఈ సందర్భంగా బస్టాండ్ అలుగు, బీసీ, ఎస్సీ కాలనీల్లో కల్వర్టులు, బ్రిడ్జిలను పరిశీలించి వరద బాధితులను పరామర్శించారు. కాలువ ఆక్రమణకు గురై వెడల్పు లేక లోతు లేకపోవడంతో ప్రతిసారీ వరదలు గ్రామం మీదకు వచ్చి నష్టపోతున్నామని ఎమ్మెల్యేకు బాధితులు వివరించారు. ప్రతిసారీ భారీ వర్షాలవల్ల బస్టాండ్ చెరువు నుండి సారంగయ్య చెరువు వరకు ఉన్న వరద కాలువకు నిధులు మంజూరు చేసి అవసరమైన చోట బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ సయ్యద్ ఇమామ్, మండల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story