Wall Posters Against Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-13 06:13:51.0  )
Wall Posters appear Against Komatireddy Rajagopal Reddy in Choutuppal
X

దిశ, చౌటుప్పల్: Wall Posters appear Against Komatireddy Rajagopal Reddy in Choutuppal| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మునుగోడు నిన్ను క్షమించదు అంటూ కోమటిరెడ్డిని వ్యతిరేకిస్తూ రాత్రికి రాత్రే మున్సిపల్ కేంద్రంలో వాల్ పోస్టర్ లు ఏర్పాటు చేశారు. 22 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాను కలిసి బేరమాడిన నీచుడివంటూ ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఇంతకూ ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారన్నది తేలాల్సి ఉంది.

మునుగోడులో బ్లాక్ మెయిల్ పాలిటిక్స్.. నేతల బెదిరింపుతో పార్టీలకు కొత్త తలనొప్పి




Advertisement

Next Story