ఉత్తమ్ మాటలన్ని ఉత్తవే : సైదిరెడ్డి

by Naresh |   ( Updated:2023-11-16 09:12:44.0  )
ఉత్తమ్ మాటలన్ని ఉత్తవే : సైదిరెడ్డి
X

దిశ, నేరేడుచర్ల: 24 గంటలు కరెంటు ఎలా అందుబాటులో ఉంటుందో మన ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా అలానే అందుబాటులో ఉంటాడని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లి కాసోజు శంకరమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గరిడేపల్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. ప్రచారంలో శంకరమ్మ పాల్గొని మాట్లాడుతూ...రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని అందుకే రైతులను గుర్తించి రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు జరిపారు అన్నారు. గత పాలకులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వహించారని ఆరోపించారు. కేసీఆర్ కూడా ఒక రైతు కాబట్టే రైతు కష్టాలు ఆయనకు తెలుసు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలన మెచ్చుకున్నారని మళ్లీ అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు. రాష్ట్రమంతా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం నడుస్తుందని మన పార్టీ అధికారం రాబోతుందని ఇక్కడ సైదిరెడ్డి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే మాటలన్నీ ఉత్తవేనని ఆయన మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అని ప్రజలను కోరారు. ఉత్తంకుమార్ రెడ్డి స్థానికుడు కాదని గెలిచిన ఓడిన ఇక్కడ ఉండడని ఇక్కడ ఉండే నాయకుడు సైదిరెడ్డి అని ఆయన గెలిపిస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ప్రజలను కోరారు.

Advertisement

Next Story