ఉత్తమ్ కుమార్ సీఎం అవుతారు.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Nagam Mallesh |
ఉత్తమ్ కుమార్ సీఎం అవుతారు.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ః రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారంటూ భువనగిరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవిపై నానా రచ్చ జరుగుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఇలాంటి కామెంట్లు చేయడం అందరికీ షాక్ కలిగించింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో జరుగుతున్న నీటిపారుదల ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అనుకోకుండా సీఎంగా సంభోదించారు. నాలుక కరుచుకున్న ఆయన.. నా నాలుక పై మచ్చలు ఉన్నాయని నేను అన్నది అవుతుంది ఏనాటికైనా ఉత్తమ్ సీఎం అవుతారని చమత్కరించారు. ఆయనకు సీఎం అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయన్నారు. దీంతో సభలో పాల్గొన్న వారంతా ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యారు.

Advertisement

Next Story

Most Viewed